హత్యాచారానికి ముందు రోజు.. నిందితుడు ఆస్పత్రిలోనే ఉన్నాడా

కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. హత్యాచారం ముందు రోజు నిందితుడు ఆస్పత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ బాధిత వైద్యురాలిని గమనించిన దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి. ఈ కేసులో గ్యాంగ్ రేప్‌ జరిగిందని ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్​ఏ రిపోర్ట్‌ ఇప్పుడు కీలకంగా మారింది. అయితే వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని, డీఎన్​ఏ రిపోర్ట్స్‌ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రమేయం ఉందో తేలుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.