గ్రోక్తో సారీ చెప్పించుకున్న డైరెక్టర్ వీడియో

గ్రోక్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చ నడుస్తోంది. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ రూపొందించిన ఈ ఏఐ టూల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రశ్న అడిగినా ఠక్కున సమాధానం చెప్పే గ్రోక్.. కొన్ని విషయాల్లో మాత్రం తప్పు జవాబులు, మరికొన్నిసార్లు వివాదాస్పద కామెంట్లు చేస్తోంది. ఇలా టాక్ ఆఫ్ ది ఎక్స్‌గా మారిన గ్రోక్.. ఇప్పుడు ఒక ప్రముఖ డైరెక్టర్ కు సారీ చెప్పింది.గ్రోక్ క్షమాపణ చెప్పిన డైరెక్టర్ మరెవరో కాదు.. కశ్మీర్ ఫైల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన వివేక్ అగ్నిహోత్రి. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గ్రోక్.. ఫేక్ వార్తలు సృష్టించే వ్యక్తుల జాబితాలో వివేక్ పేరును పెట్టింది.