మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు మంత్రి సీతక్క. జిల్లా కలెక్టర్, SPతో కలిసి జాతర అభివృద్ధి పనులు పరిశీలించారామె. జంపన్నవాగుపై తెగిన లో లేవల్ కాజ్ వేలు.. మేడారానికి వెళ్ళే అన్ని రహదారులు వెంటనే మరమ్మత్తులు చేయాలన్నారు. పస్రా, తాడ్వాయి, మేడారం మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు సీతక్క. ఈసారి జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు సీతక్క.