యూపీలోని సహరాన్‌పూర్‌లోని బెహత్ తహసీల్దార్ ఆఫీస్‌లోకి ఓ కోతి ప్రవేశించింది. కార్యాలయంలోని టేబుల్ ముందు కూర్చుని ఓ అధికారిలా ఫైళ్లను తనిఖీ చేస్తూ కనిపించింది. కోతి టేబుల్ ముందున్న కూర్చీలో కూర్చుని ఫైళ్లలోని పేజీలు తిప్పడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అధికారులు అరటి పండు ఇచ్చినా.. అత్యాశకు పోకుండా, కనీసం అటువైపైనా చూడకుండా బిజీగా ఫైళ్లు తిరగేయడం వీడియోలో కనిపిస్తుంది.