భార్యను పాము కాటు వేసిన ప్రాంతానికి వెళ్లిన భర్త..అంతలోనే వీడియో

విజయనగరం జిల్లా ఎల్కోట మండలం లింగంపేటకు చెందిన నందిపల్లి సత్యవతి అనే మహిళను రాత్రి పాము కాటేసింది. ఆమెను వెంటనే ఎల్కోట ప్రభుత్వ ఆసుపత్రికి, తరువాత ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తక్షణమే చికిత్స అందించడంతో ఆమె ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. పాము కాటు వేసిన తర్వాత, ఆ పాము మృతి చెందినట్లు కనిపించింది. వైద్యులు ఈ ఘటనపై వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాత్రం సత్యవతిని కరవడం వల్లే పాము చనిపోయిందని నమ్ముతున్నారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.