శ్రీశైలం భ్రమరాంబ ముక్కంటి ఆలయానికి 2వ రోజూ పోటెత్తిన భక్తజనం

వరుస సెలవుల నేపధ్యంలో సోమవారం శ్రీశైలం రెండవ రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ నెలకొంది. నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రెండవ రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనానికి సుమారు 10 గంటలు సమయం పట్టనుంది. వరుసగా సెలవులు రావడంతో భక్తుల రద్దీతో క్షేత్రమంతా భక్తజనం సందోహం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.