డార్లింగ్స్ పండగ చేసుకోండమ్మా..కల్కీ రిలీజ్ పై హింట్ వచ్చిందోచ్ ! Prabhas Kalki 2898 Ad Trailer

ఈ ఏడాది రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి రుచి చూపించాడు. వరుస ఫ్లాప్ లతో సతమతం అయిన ప్రభాస్ సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన సలార్ సినిమా గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. సలార్ సినిమా ఇప్పటికే రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా కావాలని అనుకుంటున్నారో అలాంటి సినిమా ఇచ్చాడు ప్రశాంత్ నీల్. డార్లింగ్ కటౌట్ కు కరెక్ట్ సినిమా ఇది అంటున్నారు ఫ్యాన్స్. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సలార్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్.