ఏటీఎం మిషన్‌లో డెబిట్ కార్డు పెడితే డబ్బులు వస్తాయి. ఒకవేళ కార్డు లేకపోతే ఏం చేయాలి..! సాధారణంగా ఎవరినైనా అడిగి అప్పు తీసుకుంటాం.. లేదంటూ ఊరుకుంటాం.. కానీ మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు డిఫరెంట్‌గా ఆలోచించాడు. అర్జంట్‌గా డబ్బు అవసరమొచ్చింది. ఏం చేయాలబ్బా.! అంటూ ఏటీఎంలో చోరీకి బరితెగించాడు. అయితే ఏటీఎం పగలకొట్టినప్పుడు.. అక్కడే సీసీ కెమెరా ఉందన్న సంగతి మరిచిపోయాడు.