ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు.. తండ్రి ఏం చేశాడో తెలుసా

తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తులు కావాలి కానీ.. తల్లిదండ్రులు మాత్రం మాకు అక్కర్లేదు అన్నట్టుగా తయారవుతున్నారు కొందరు ప్రబుద్ధులు. జన్మనిచ్చి, పెంచి పోషించిన తల్లిదండ్రులను రోడ్డుపాలుచేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా ఇలాంటిదే మరో ఘటన మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే తనను పట్టించుకోని కొడుకు తిక్క కుదిర్చాడు ఆ తండ్రి. తన ఆస్తిని తనకు తిరిగి ఇవ్వాలని కోర్టుకెక్కాడు.