త్వరలో ప్రభుత్వ పోర్టల్ .. వేగంగా క్లెయిమ్ సెటిల్ మెంట్లు - Tv9

ఆరోగ్య బీమా క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త పోర్టల్‌కు శ్రీకారం చుట్టనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్‌ క్లెయిమ్‌ ఎక్స్ఛేంజ్ పోర్టల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బీమా కంపెనీలు, ఆసుపత్రులు, పాలసీదారులకు మధ్య ఇది ఉమ్మడి వేదికగా ఉండనుంది. బీమా రంగంలోనే ఇదొక కీలక మలుపుగా మారనుంది.