Viral శ్రీశైలంలో శివుడికి కొత్త కారు గిఫ్ట్ - Tv9

సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేర్చినందుకు తమ ఇష్టదైవానికి కానుకలు సమర్పించుకుంటుంటారు. కొందరు ఆలయాలకు విరాళాలు ఇస్తుంటారు. ఆభరణాలు, నగదు ఇలా తమకు తోచిన రీతిలో సమర్పిస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు శ్రీశైల మల్లన్నకు కారును విరాళంగా సమర్పించాడు. ఇకపై స్వామివారి వాహన సేవలో ఇదికూడా భాగమవుతుందేమో..!