చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.. సీనియర్ జర్నలిస్ట్‌పై జబర్దస్త్‌ నటి సీరియస్

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా జరుగుతున్నాయి. ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు సినిమా వాళ్లు. సోషల్ మీడియా వాడకం ఎక్కువైన ఈ కాలంలో సినిమా ప్రమోషన్స్ కూడా అదే స్టైల్ లో చేస్తున్నారు సినిమా టీమ్స్.. ఏదైతే వైరల్ అవుతుందో.. జనాలోకి ఏది అయితే ఎక్కువగా వెళ్తుందో.. ప్రమోషన్స్ కూడా అలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బర్త్ డే బాయ్ అనే సినిమా కోసం జబర్దస్త్ ఫెమ్ రోహిణి ఓ రేవ్ పార్టీలో దొరికిపోయినట్టు ఓ ఫన్నీ వీడియో చేశారు.