తలనొప్పి ఎప్పుడైనా రావచ్చు. ఒక్కోసారి ఆకస్మాత్తుగా వచ్చే తలనొప్పి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. నొప్పి తీవ్రతను భరించలేని వారు కొందరు మందులను ఆశ్రయిస్తారు. మరికొంతమంది వేడివేడి టీ లేదా కాఫీ తాగుతారు. అయితే కాఫీ, టీలు నిజంగా తలనొప్పిని తగ్గిస్తుందా? ఇందులో నిజమెంత? అసలు డాక్టర్లు ఏమంటున్నారు?టీ లేదా కాఫీ నిజంగా తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందా? లేక నొప్పిని మరింత పెంచుతుందా అనే అంశంపై పోషకాహార నిపుణులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీ లేదా కాఫీలోని కెఫిన్ రక్త నాళాలను సంకోచించడం ద్వారా తాత్కాలిక నొప్పి నివారణ కలిగిస్తుంది. కానీ దీర్ఘకాలంలో మాత్రం ఇది తలనొప్పిని మరింత పెంచుతుందని అంటున్నారు.