మార్కెట్లోకి సలార్ టీషర్ట్స్.. ధరెంతో తెలుసా.. @Tv9telugudigital

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తున్నారు. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ సలార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.