మనుషుల్లో మానవత్వం రోజురోజుకు కనుమరుగవుతూ.. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే తమ పిల్లలను కడతేర్చుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో మనుషుల్లో కనుమరుగవుతున్న మానవత్వం జంతువుల్లో కనిపిస్తోందా అనిపిస్తోంది. ఇలాంటి సంఘటనలకు అద్దం పట్టే వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుక్కపిల్లను ఎత్తుకొచ్చిన ఓ కోతి దాన్ని కన్నబిడ్డలా సాకుతున్న వైనాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.