అక్కడ ఎదురింటికెళ్లాలంటే.. 3 కి.మీ. నడవాలి..!

ముక్కు ఎక్కడుంది అంటే తలచుట్టూ తిప్పి చూపించినట్టు.. ఏదైనా అత్యవసరమై ఎదురింటికి వెళ్లాలన్నా ఏకంగా 3 కిలో మీటర్లు నడవాలి. అవును మీరు విన్నది నిజమే. ఈ పరిస్థితి మరెక్కడో కాదు.. తెలంగాణలోని నల్గొండలో. నార్కట్‌పల్లి అద్దంకి రహదారి నల్గొండ బైపాస్‌లో పానగల్‌ పై వంతెన నుంచి కేశరాజుపల్లి చౌరస్తా వరకు ఎక్కడా రోడ్డు దాటే అవకాశమే లేకుండా యూటర్న్‌ మూసి వేశారు.