వావ్‌! చరణ్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. తనదైన నటన, డ్యాన్సులు, ఫైట్లతో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు రామ్ చరణ్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇందులో అతను చేసిన డ్యాన్సులు, ఫైట్స్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టాయి.