మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్‌మోదీ.. ఆమె ఎవరంటే..

క్రికెట్ గురించి తెలిసిన వాళ్లకి లలిత్ మోదీ పేరు గుర్తుండే ఉంటుంది. ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ 61 ఏళ్ల లలిత్ మోదీ మళ్లీ ప్రేమలో పడ్డారు. వాలంటైన్స్ డే నాడు తన కొత్త ప్రేయసి రీమా బౌరీని నెటిజన్లకు పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.