అయోధ్య రాముడి కోసం 2,500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం. ఇందుకోసం రూ. 25లక్షలు వెచ్చిస్తున్నట్లు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్ కుటుంబం వెల్లడించారు. మోగించినపుడు ఓంకార శబ్దం రావడం దీని ప్రత్యేకత. ఈ గంటను జింక్, రాగి, సీసం, తగరం, నికెల్, వెండి, బంగారం వంటి 8 లోహాలతో తయారు చేశామని మిత్తల్ చెప్పారు. దీని తయారీలో 250 మంది కార్మికులు పాల్గొన్నారని.. సుమారు మూడు నెలలు పట్టిందని తెలిపారు.