సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న మహేష్.. ఫ్యామిలీకి సైతం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. షూటింగ్ నుంచి సమయం దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తుంటారు. అటు మహేష్ తనయ సితారకు మంచి ఫాలోయింగ్ ఉంది. డాన్స్ రీల్స్ చేయడం దగ్గర్నుంచి.. ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది సితార. ఇక మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రేక్షకులకు సుపరిచితమే.