సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తున్నా హనుమాన్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వస్తున్న సినిమా ఇదొక్కటే కాబట్టి. దీనికి థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ చాలా రోజులనుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. దర్శక నిర్మాతలు కూడా దీని గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. అయితే రిలీజ్ డేట్ దగ్గరికి రావడంతో థియేటర్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం చాలా కష్టంగా మారుతోంది. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీడియాకే చెప్పుకుంటున్నారు మేకర్స్. ముఖ్యంగా హనుమాన్ సినిమాకు థియేటర్లు ఇవ్వడానికి హైదరాబాదులో చాలామంది ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తున్నా కూడా ఇవ్వనివ్వడం లేదు అంటూ నిర్మాత నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.