ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం రోజురోజుకూ భీకరంగా మారుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో నిత్యం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు బలవుతుండటం యావత్ ప్రపంచాన్ని కలచివేస్తోంది. రోజుకు దాదాపు 420 మంది చిన్నారులు మరణించడమో లేదా తీవ్రంగా గాయపడటమో జరుగుతోంది. వేల మంది చిన్నారుల మరణంతో ‘గాజా.. చిన్నారుల శ్మశాన వాటిక’గా మారిందని ఐక్యరాజ్యసమితి విభాగం యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.