అంతరిక్షంలో మిస్సయిన టమాటాలు దొరికాయి @Tv9telugudigital

అంతరిక్షంలో 2 టమాటాలుతప్పిపోయాయి. వాటి గురించి తెగ వెతికారు.. అయినా దొరకలేదు. సరేలే.. రెండు టామాలే కదా అని లైట్‌ తీసుకున్నారు. అయితే ఆ టమాటాలే ఇప్పుడు సైంటిస్టులకు సరికొత్త వివరాలు తెలిపాయి. అయితే అప్పుడు మిస్సయిన టమాటాలు ఇప్పుడు దొరికాయి. ఈ టమాటాలు మిస్సయ్యి 8 నెలలు తర్వాత దొరికాయి. ఇక్కడ విశేషమేంటంటే.. చెట్లనుంచి టమాటాలు తెంచి 8 నెలలు గడచినా వాటిలో పెద్దగా మార్పులేదని తేలింది. టమాటాలులో నీటిశాతం తగ్గి, కొంత రంగు మారి, కొంచెం మెత్తబడ్డాయి తప్ప అవేమీ చెడిపోలేదన్నారు నాసా శాస్త్రవేత్తలు. సూక్ష్మజీవులు లేదా శిలీంధ్రాల పెరుగుదల వాటిలో కనిపించలేదని స్పష్టం చేశారు.