పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే..!

పంటపొల్లాల్లో, పంపుసెట్లలో ఎక్కడచూసినా కొండచిలువలే.. జనాలను భయంతో పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని సింగన్ గావ్ గ్రామ శివారులోని సోయా పంట పొలంలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలు, రైతు ఆ భారీ కొండచిలువను చూసి భయంతో పరుగులు తీశారు. ఆ వెంటనే గ్రామస్తులు తానూర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ షహబాజ్ కి సమాచారం అందించారు.