మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్టోబరు 6 తెల్లవారుజూమున ముంబైలోని గోరెగావ్ ఎంజీ రోడ్డులోని ఓ ఐదంతస్తుల భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు అపార్ట్ మెంట్‌ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కాగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు మరో 30 మంది వరకు భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.