విడాకులు అంత ఈజీ కాదు.. ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌

అందాల తార ఐశ్వర్యారాయ్, హీరో అభిషేక్ బచ్చన్ విడిపోయారని, విడాకులు తీసుకున్నారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్యన ఐశ్వర్య, అభిషేక్ ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి విడివిడిగా హజరయ్యారీ లవ్లీ కపుల్. ఐశ్వర్యరాయ్ తన కుమార్తెతో కలిసి ఈ వివాహానికి హాజరైంది. మరోవైపు అభిషేక్ మాత్రం అమితాబ్, జయ బచ్చన్ తో కలిసి అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు. ఇలా వీరిద్దరూ విడివిడిగా రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.