ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సొరంగంలో కార్మికులు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు? గుండె ధైర్యంతో ఎలా కలిసికట్టుగా ఉన్నారు వంటి విషయాలను వీడియోలో ఆ వ్యక్తి వివరించారు. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుడు తీసిన వీడియోలో భారీ యంత్ర సామగ్రి కనిపిస్తోంది. వాటితో పాటు టన్నెల్‌లో కార్మికులందరూ కలిసికట్టుగా ఉన్న సీన్లు కనిపిస్తున్నాయి.