షారుక్ ఖాన్, రామ్ చరణ్.. ఒకరు బాలీవుడ్‌లో సూపర్ స్టార్ అయితే మరొకరు టాలీవుడ్‌లో మెగా పవర్ స్టార్. ఇద్దరు హీరోలకు ప్రపంచ వ్యాప్తంగా బోలెడు అభిమానులు ఉన్నారు. వీరి సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. అలాంటి స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే.. ఫ్యాన్స్‌కు పండగే.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ నిజయమ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షారుక్, రామ్ చరణ్‌లు ఒకే సినిమలో కలిసి నటించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తోంది. అది కూడా క్రేజీ ఫ్రాంచైజీ ధూమ్ సిరీస్‌లో.