మోక్షు హీరోగా ‘ఆదిత్య 369’ సీక్వెల్ అనౌన్స్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ నటించిన ఐకానిక్ చిత్రాల్లో ఆదిత్య 369 ఒకటి. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా 1991లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.