ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా రైతులు చేతికందిన చెరకును కోయాలంటే గజగజ వణికిపోతున్నారు. సాధారణంగా రైతులు చేతికొచ్చిన పంటను వీలైనంత త్వరగా కోసి, కొత్త పంటకు నేలను సిద్ధం చేస్తారు. అయితే దీనికి విరుద్దంగా ఆ ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న చెరకు, వరి పంటలను కోసేందుకు రైతులు వెనుకాడుతున్నారు.