శ్రీవారి పరకామణిలో రూ. 100 కోట్లు కొట్టేసారా... అయ్యో దేవుడా...!

తిరుమలలో అత్యంత పరమ పవిత్రంగా భావించే పరకామణిలో దొంగలు పడ్డారా? భక్తులు ఎంతో భక్తితో హుండీలో వేసే నగదుకు రక్షణ లేదా? అంటే అవుననే అంటున్నాడు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. గత ప్రభుత్వం హయాంలో టీటీడీలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. పరకామణిలో 80 వేలు చోరీ చేశాడని చెబుతున్న వ్యక్తి నుంచి భారీ స్థాయిలో ఆస్తులను టీటీడీకి రాయించుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీనికి వెనుక పెద్ద కుంభకోణం ఉందన్నారు. ఏకంగా 100 కోట్ల రూపాయల కుంబకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు.