సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వినోదాన్ని పంచితే.. కొన్ని వీడియోలు విజ్ఞానాన్నీ పంచుతాయి. అసలే మన భారతీయుల తెలివితేటలు మామూలుగా ఉండవు. పనికిరాని వస్తువులను కూడా తమ బుద్ధి బలంతో పనిముట్లుగా మార్చేస్తారు. ఇందులో మన ఇండియన్స్‌ది అందెవేసిన చెయ్యి. మనవాళ్లు తయారుచేసిన ఎన్నో జుగాడ్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం.