సాధారణంగా ఇళ్లలో, దుకాణాల్లో చోరీలకు పాల్పడటం సహజంగా మనం చూస్తుంటాం. ఇక ఆలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లడం కూడా చూశాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన దొంగలు హుండీలను పక్కన పెట్టి విలువైన దేవతా విగ్రహాలపై ఫోకస్ చేశారు. హుండీ ఎత్తుకెళ్తే చిల్లరే దొరుకుతుంది.. విగ్రహాలైతే గిట్టుబాటు అవుతుంది అనుకున్నారో ఏమో ఓ ఆలయంలో భక్తులుగా వచ్చిన కొందరు మహిళలు ఆ గుడిలోని దేవుడిపై కన్నేశారు.. గర్భగుడిలోకి ప్రవేశించి దేవునికి మొక్కుతున్నట్టే మొక్కి అక్కడి పంచలోహ విగ్రహాలను సంచిలో సర్దుకొని వెళ్లిపోయారు.