పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతలో ఓ యువతి ఆత్మహత్య కేసులో చిత్రంలో కీ రోల్స్ పోషిస్తున్న వారిలో ఒకరైన జగదీష్ జైలుకెళ్లడంతో మైత్రి మూవీ మేకర్స్ కు, డైరెక్టర్ సుకుమార్‌కు ఈ ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది.