Hezbollah పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ పై హెజ్ బొల్లా దాడులు Israel Palestine Conflict - Tv9

ఇజ్రాయెల్‌పై లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌ తొలిసారిగా బుర్కాన్‌ క్షిపణిని ప్రయోగించింది. మరిన్ని అధునాతన ఆయుధాలతో దాడులు చేయనున్నట్లు ఆ గ్రూప్‌ చీఫ్‌ హసన్‌ నస్రల్లా తెలిపారు. హమాస్‌తో భీకర యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్‌కు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌ నుంచి కూడా దాడులు ఎదురవుతున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా ఈ గ్రూప్‌ ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. కొన్ని రోజుల కిందట డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ను ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ప్రయోగించింది.