చెర్రీ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే న్యూస్... - Tv9

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా గేమ్ ఛేంజర్‌. వినయ విధేయ రామ తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి చరణ్‌తో జోడీ కట్టింది. దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మెగా మూవీని నిర్మిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌ చరణ్‌ నటించిన ఫుల్‌ లెంగ్త్‌ మూవీ కావడంతో గేమ్ ఛేంజర్ ’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ మూవీ అంతకంతకూ ఆలస్యమవుతోంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పటివరకు కనీసం ఒక టీజర్‌, సాంగ్‌ విడుదల చేయకపోవడంతో అభిమానులు రామ్ చరణ్‌ ఫ్యాన్స్‌ గుస్సా అవుతున్నారు.