విజయవాడ రైల్వే స్టేషన్‌లో మిరాకిల్ జరిగింది. ఒక వ్యక్తి రైలు కింద పడిపోయాడు. అతడు చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ విధి అతడిని కరుణించింది. ఎలాంటి గాయాలు లేకుండా ఆ వ్యక్తి బతికివచ్చాడు. అనంతపురానికి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి, బెజవాడ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ ఒకటి మీద ఉన్నాడు. రన్నింగ్‌లో ఉన్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను అందుకోవడానికి ప్రయత్నించాడు. కానీ కాలుజారి పట్టాల మీద పడిపోయాడు.