కిడ్నాప్ డ్రామా ఆడిన నిందితుడు Online Game Case - Tv9

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాకు చెందిన ఓ బీఎస్సీ విద్యార్థి ఆన్‌లైన్ గేమ్‌ ఆడి సుమారు రూ.5.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ మొత్తాన్ని అతని సోదరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఉంచారు. ఆన్‌లైన్ గేమ్‌లో రూ. 5 లక్షలకు పైగా మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ కుర్రాడు కిడ్నాప్ నాటకం ఆడాడు. ఆన్‌లైన్ గేమ్‌లో భారీగా సొమ్మును పోగొట్టుకున్న అతన్ని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కిడ్నాప్‌ నాటకం ఆడి, తప్పుడు కథనాన్ని సృష్టించాడు. విద్యార్థి కిడ్నాప్‌పై పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కుటుంబసభ్యులు మందలింపుతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.