ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పండగలంటే చేసే హడావిడి అంతాఇంతా కాదు. ఇంటికొచ్చిన చుట్టాలను మర్యాదలతో కట్టిపడేయటం గోదావరి జిల్లా వాసుల ప్రత్యేకత. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల రెండవ కుమార్తె హరిణ్యకు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్‌తో ఇటీవల వివాహం అయింది. కొత్తగా పెళ్లయి వచ్చిన చిన్నల్లుడిని సంక్రాంతి పండగకు ఆహ్వానించి 500 రకాలతో ప్రత్యేక విందును ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు అత్తా, మామలు.