గంటల్లో గొట్టపు మార్గాన్నితొలిచి సిద్ధం చేసిన కార్మిక నిపుణులు - Tv9

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిల్‌క్యారా వద్ద సొరంగం తవ్వే పనిలో నిమగ్నమైన కార్మికుల్లో 41 మంది ఈ నెల 12న అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. యావద్దేశాన్ని కదిలించిన ఈ ఘటనలో ఆ కార్మికులను ఆదుకునేందుకు భారీ యంత్రాలతో, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అవిశ్రాంతంగా పనిచేశాయి. ఎస్డీఆర్‌ఎఫ్‌, బీఆర్‌వో, సైన్యంలోని ఇంజినీరింగ్‌ విభాగం, జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వంటివి అనేకం రంగంలో దిగి వేర్వేరు ప్రత్యామ్నాయాలను పరిశీలించాయి.