జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ 82 ఏళ్ల వయసున్న బామ్మ తాజాగా నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలకు చెందిన చీటి శ్యామల జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. ఆమె స్వాతంత్ర్య సమరయోధుడు మురళీధర్ రావు భార్య కూడా. వృద్ధాప్యంలో తాను నామినేషన్ వేయడానికి ఓ బలమైన కారణం ఉందని అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు.