శాంతించు గోదారి! Huge Flood Flow In Godavari River

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. గంటగంటకు పెరుగుతున్న వరద కారణంగా.. భద్రాచలం వద్ద గోదావరి.. ప్రవాహం నీటి మట్టం 52 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. దీంతో పాటుగా పోలవరం వద్ద 13.75 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. దీంతో ధవళేశ్వరం దగ్గర 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.