కాలేజ్ క్యాంపస్‌లోకి అనుకోని అతిథి ఎంట్రీ ఇచ్చింది. ఊహించని ఈ పరిణామానికి విద్యార్ధులు భయంతో పరుగులు తీశారు. మహారాష్ట్రలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ బాంబే క్యాంపస్‌లో భారీ మొసలి సంచారం తీవ్ర కలకలం రేపింది. రోడ్డుదాటి నేరుగా కాలేజ్ క్యాంపస్‌లోకి వచ్చిన మొసలిని చూసి స్థానికులు, విద్యార్ధులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ భారీ మొసలిని చూసి అందరూ తలోదిక్కూ పరుగులు తీశారు.