అమెరికా ప్రెజిడెంటుగ మల్ల ఎన్నికైన ట్రంపు సారుకు వాళ్ల దేశంలన్న గుడికట్టి విగ్రహం పెట్టినోల్లు ఉన్నరో లేరోగనీ... మన జనగాం జిల్లాల ఒక వీరాభిమాని అప్పట్లనే గుడి కట్టి విగ్రహం నిలవెట్టి నిచ్చెపూజలు చేశిండు. అయితె ఎవలి కండ్లు మండినయో, ఎవలి జిట్టి తలిగిందో.. అటు ట్రంపు సారు ఓడిపోయిండు.. ఆ వీరాభిమానిగూడ పానం బాగలేక కాలంజేశిండు. మల్ల ఇప్పుడు, ఇన్నేండ్లకు ఎండిపోయ్న చెట్టు ఇగురువెట్టినట్టు, మూతవడ్డ ఆ గుడిని తెర్శి, బూజువట్టిన ట్రంపు బొమ్మకు పాలాభిషేకాలు చేస్తున్నరట అదే ఊల్లె ఉండే ట్రంపుసారు అభిమానులు..