Andhra Pradesh వంజంగి మేఘాల కొండపైకి నో ఎంట్రీ.. @Tv9telugudigital

శీతాకాలం.. వంజంగి మేఘాల కొండ సోయగం అంతా ఇంతాకాదు. . దేవ లోకం భువికి దిగొచ్చిందా అన్నట్టుగా మంచు మేఘాలు కనువిందు చేస్తాయి. పాల నురుగులాంటి మంచు మేఘాల మధ్య విహరిస్తూ ఆనందిస్తారు పర్యాటకులు. ఇక న్యూ ఇయర్‌ వచ్చిందంటే..వంజంగి లో సెలబ్రేషన్స్‌ మాములుగా ఉండవు. . ఈసారి కూడా చాలా మంది అల్లూరిజిల్లాలోని వంజంగి టూర్‌కు ప్లాన్‌ చేసే ఉంటారు. అలాంటివారికి ఈ వార్త కాస్త నిరాశ కలిగిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే జనవరి 2 నుంచి 9వ తేది వరకు వంజంగి కి పర్యాటకులను అనుమతించరు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు కూడా . పర్యాటకుల క్షేమం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.