డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ .. ఎందుకంటే.. - Tv9

0 seconds of 1 minute, 32 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:32
01:32
 

తాజాగా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్​’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. డిసెంబర్‌ 20న తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లను స్విచ్ ఆఫ్ చేయాలని కోరింది. డిసెంబర్‌ 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తమ కుటుంబాలతో సరదాగా గడపాలని, పిల్లలు వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలని ప్రజలను కోరింది. కంపెనీ చేసిన ఓ సర్వేలో.. 77 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు వివో తెలిపింది. తల్లిదండ్రులకు సైతం ఫోన్​ వ్యసనంగా మారిందని తెలిపింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య అంతరాలు ఏర్పడితే భవిష్యత్తులో సమాజానికి నష్టం కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.