ఈ ఫొటో చూస్తుంటే.. పెద్దగా నోరు తెరుచుకుని మీదికొస్తున్న దెయ్యంలా.. చూడగానే వామ్మో అనిపించేలా ఉంది! ఇది ఏ మేఘమో, గ్రాఫిక్స్ ఫొటోనో, సరదాగా సృష్టించిన చిత్రమో కాదు.. సుదూర అంతరిక్షంలోని ఓ భారీ గెలాక్సీది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ క్లిక్‌మనిపించిన అంతరిక్షం ఫొటో.. దెయ్యంలా భయపెట్టింది. టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ గెలాక్సీని గుర్తించారు. మన విశ్వం పుట్టుక తొలినాళ్లలోనే ఈ గెలాక్సీ ఏర్పడిందని.. అది భారీగా దుమ్ము, ఇతర ఖగోళ పదార్థాలతో నిండి ఉందని వారు తెలిపారు.