అమెరికాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. టీనాహైన్స్ అనే మహిళ అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు చికిత్సకోసం ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో ఓ అరగంటపాటు ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆమె శరీరం కూడా నీలంగా మారిపోయింది. టీనాను పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్టుగా నిర్ధారించారు. ఇక ఆస్పత్రినుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు.