ఇళ్లల్లో పనిచేస్తూ అన్ని పనుల్లో సాయం చేసే పనిమనుషులు హీరోల కన్నా తక్కువేం కాదు. తన ఇంట్లో అందరికీ వండిపెట్టే కుక్‌కు అంకిత్ అనే చిన్నారి ఏకంగా ఫోన్‌నే గిఫ్ట్‌గా ఇచ్చాడు. టోర్నమెంట్స్‌లో గెలిచిన డబ్బుతో తమ ఇంట్లో నమ్మకంగా పనిచేసే వంట మనిషికి ఫోన్ బహుమతిగా ఇచ్చాడు. వీకెండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్‌లో అంకిత్ అనే బాలుడు రూ. 7000 గెలుచుకున్నాడు. తాను పసివాడిగా ఉన్నప్పటి నుంచి తనను పెంచిన తమ కుక్ సరోజకు రూ. 2000 వెచ్చించి ఫోన్ కొనిచ్చాడు.