నాగుల చవితి పర్వదినాన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా భక్తులు నాగుల చవితిరోజు కుటుంబంలోని చిన్నా, పెద్దా అందరూ కలిసి పుట్టలో పాలు పోసి నాగదేవతను పాము రూపంలో ఆరాధిస్తారు. తమ పిల్లలను, కుటుంబాన్ని చల్లగా చూడమని ఆ సుభ్రమణ్యుని వేడుకుంటారు. సంతానం లేనివారు నాగులచవితి, నాగపంచమి రోజున పుట్టలో పాలుపోసి నాగదేవతను ఆరాధిస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.